Surprise Me!

TamilNadu 'Moi virundhu' : కష్టం వస్తే విందు ఏర్పాటు చేసే ఓ వినూత్న సంప్రదాయం | DNN | ABP Desam

2022-08-27 1 Dailymotion

తమిళనాడు లోని తంజావూరు జిల్లాలో పేరవూరని నియోజకవర్గం శాసనసభ్యుడు అశోక్ కుమార్ మెుయ్ విందు ఏర్పాటు చేశారు. వంద పొట్టేళ్ళు కొట్టి మంచి మాంసం ఏర్పాటు చేశారు. శాఖాహారులకు, సాంబారు, పాయసం, వడతో పాటుగా వివిధ రకాల వెరైటీలు అందుబాటులో ఉంచారు. దాదాపు 8వేల మందికి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరైన ప్రతి ఒక్కరూ వారి వారి తాహతకు తగినంత చదివింపులు చేశారు. అలా వచ్చినవి లెక్కగడితే... వసూలు ఐంది ఎంతో తెలుసా...15 కోట్ల రూపాయలు.